స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:58 PM
రాష్ట్రాన్ని స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, డిసెంబరు 20, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర, స్వచ్చాంఽధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడోశనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించి ప్రకృతిని పర్యవేక్షించేందుకు ఈకార్యక్రమం చేపట్టామన్నారు. బనగా నపల్లెను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుం టున్నామన్నారు. బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్చమైన గాలి, వాతావ రణం కోసం బనగానపల్లెలో చెట్లను నాటామన్నారు. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ విధానం ద్వారా గ్రామ పంచా యితీ ఆదాయాలను పెంచుకోవచ్చన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం, డ్వాక్రా సంఘాల ఫుడ్ స్టాళ్లను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో వేస్ట్ ప్లాస్టిక్ పదా ర్థాలు తీసుకుని కిరాణా సరుకులు అందిచే మొబైల్ షాప్‌ను పరిశీలించారు.