శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:23 AM
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
సైబర్ నేరాలపై అవగాహన
అనుమానితులు, నేరచరిత్ర గల వారిపై నిఘా
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్
నంద్యాలలో 49 వాహనాలు సీజ్
నంద్యాల క్రైం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతిరోజు సిబ్బంది వారి స్టేషన్ పరిధిలోని నేరచరిత్ర గలవారిపై, అనుమానితులపై, రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. నంద్యాలలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవనగర్‌లో సీఐలు కంబగిరిరాముడు, ఇస్మాయిల్, సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు, క్యూఆర్టీ సిబ్బంది దాడిచేసి సరైన ధృవపత్రాల్లేని 49వాహనాలు సీజ్ చేశారన్నారు. ఆత్మకూరు సబ్ డివిజన్‌లోని మూడు ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి టౌన్ సీఐ రాము, సిబ్బంది ఏబీఎంపాలెం, గొల్లపేట, కొట్టాలచెరువుల్లో 20లీటర్ల నాటుసారా చేశారని, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నందికొట్కూరు సీఐ ప్రకాష్, సిబ్బంది పట్టణంలోని షికారిపేటలో 30లీటర్ల నాటుసారా సీజ్‌చేసి 500లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ముచ్చుమర్రి ఎస్సై, సిబ్బంది లక్ష్మాపురం గ్రామంలో 18క్వార్టర్ విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.