పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:35 PM
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, నవంబరు 18(ఆంఽఽధ్రజ్యోతి): ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ విశాఖ రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో 613 ఒప్పందాలు, రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరిగిన సీఐఐ సదస్సు సూ పర్ సక్సెస్ అయిందన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలతో నమ్మకమైన సంస్థలు భారీఎత్తున పెట్టుబడులు పెట్టడంతో ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌కళ్యాణ్, ఇతర మంత్రులు జాతీయస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రోడ్డుషోలు నిర్వహించామన్నారు. పెట్టుబడుల శాఖామంత్రిగా తాను సీఎం సూచనలతో దుబాయ్, సౌత్ కొరియాలో పర్యటించడం అక్కడ రోడ్‌షోలో పాల్గొని అనేక కంపెనీలను ఒప్పించామన్నారు. రాష్ట్ర సుస్థిరత కోసం తపించే కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం పాటు అధికారంలో ఉంటుందన్నారు. ఉపసర్పంచ్ బురానుద్దీన్, భానుముక్కల సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌కలాం, బనగానపల్లె మార్కెట్‌యార్డు డైరక్టర్ గండం మల్లికార్జునరెడ్డి, బనగానపల్లె ఆస్పత్రి కమిటీ సభ్యుడు అహ్మద్‌హుసేన్, టీడీపీ నాయకుడు మంచాల మద్దిలేటిరెడ్డి పాల్గొన్నారు.