వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:30 AM
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి అన్నారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం ఆళ్లగడ్డలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం స్వయంగా అన్నం వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని ఎనిమిదో తరగతి చదువుతున్న హెమంత నాయక్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లురు జిల్లాలకు అండర్ 14 క్రికెటు జట్టుకు ప్రాతినిధ్యం వహించి సౌత జోన పోటీల్లో ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఎన్నిక కావడంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో శోభావివేకవతి, ఉపాఽద్యాయులు పాల్గొన్నారు.