Share News

పేదల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:32 AM

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యమని, ప్రతి పేద వారి కుటుంబం బంగారు కుటుంబం కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యం
పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యమని, ప్రతి పేద వారి కుటుంబం బంగారు కుటుంబం కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. డోన మండ లంలో గురువారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పాతపేటలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అనంతరం ఆ ప్రాంగణం లో రైతుబజారు, అర్బన హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల రెండో వారంలోపుపై పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుని అర్బన హెల్త్‌ సెంటర్‌ ప్రారంభోత్సవా నికి సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఫ్లైఓవర్‌ నుంచి పాతపేటలోకి వాహనాల రాకపోకలు సులభతరం కావడానికి ప్రత్యేక ర్యాంపు నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను సూచిం చారు. పాతపేటలోని జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. భోజనం వండుతున్న విధానం, శుభ్రత విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం రుచి శుచిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భోజ నంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కేపీ నరసింహులు, ప్రభుత్వ ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ హనీఫ్‌, నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, విజయ భట్టు, కోట్రికే హరికిషన, ఓబులాపురం శేషిరెడ్డి, ఓంప్రకాష్‌, పెద్ద కేశవయ్యగౌడు, శేషఫణిగౌడు, టీఈ రాఘవేంద్రగౌడు, ఎల్లాగౌడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:32 AM