కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2025 | 12:31 AM
కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధే లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే గౌరు చరిత భూమి పూజ
కల్లూరు, మే 1(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధే లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గురువారం నగరం లోని 37, 34వ వార్డుల్లో ఎమ్మెల్యే, కార్పొరేషన కమిషనర్ రవీంద్ర బాబుతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 37వ వార్డు ఆదిత్యానగర్‌లో రూ.49.90 లక్షలతో సీసీ రోడ్లు, 34వ వార్డు గీతానగర్‌లో రూ.9.90 లక్షలతో డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేశామ న్నారు. కల్లూరు అర్బన 16వార్డుల పరిధిలో రూ. 8కోట్ల విలువగల పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ.రాజశేఖర్, ఎంఈ.శేషసాయి, డీఈఈ. కృష్ణలత, టీడీపీ నాయకులు కె.పార్వతమ్మ, పెరుగు పురు షోత్తంరెడ్డి, ప్రభా కర్‌యాదవ్, ఎన్వీ.రామకృష్ణ, పీయూ.మాదన్న, జె.గంగాధర్‌గౌడ్, వెంకటేశ్వరరెడ్డి, నాగరాజు, జనార్దన ఆచారి పాల్గొన్నారు.
పింఛన్లుపంపిణీ చేసిన ఎమ్మెల్యే: 37వ వార్డు వీకర్‌సెక్షన కాలనీలోని ఉల్చాల రోడ్‌లో ఎమ్మెల్యే గౌరుచరిత, కమిషనర్ రవీంద్రబాబుతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొ రేటర్ అయోషా సిద్దికా, నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.