Share News

పోలియో రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:01 AM

పోలియో రహిత సమాజ ని ర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 33వ వార్డు పీహెచ్‌సీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియోను నిర్మూలించవచ్చని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం
కల్లూరు పీహెచ్‌సీలో పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

ఎమ్మెల్యేలు గౌరు చరిత, దస్తగిరి

కర్నూలు, పాణ్యం, కోడుమూరు

నియోజకవర్గాలో పల్స్‌ పోలియో

కల్లూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ ని ర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 33వ వార్డు పీహెచ్‌సీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియోను నిర్మూలించవచ్చని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

31వ వార్డు 75వ సచివాలయంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు పల్స్‌ పోలియోలో పాల్గొన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ శైలజాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు మండలం కొంగనపాడులో హౌసింగ్‌ పీడీ చిరంజీవి పల్స్‌ పోలియో చుక్కలు వేశారు. టీడీపీ నాయకుడు టి. వినోద్‌కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలియో చుక్కలను తప్పక వేయించాలి

కర్నూలు రూరల్‌: అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు. ఆదివారం గార్గేయాపురం గ్రామంలో పోలియో చుక్కలు వేశారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల పక్కన దిన్నెదేవరపాడు పంచాయతీ ఆద్వర్యంలో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.10 లక్షల పంచాయతీ నిధులతో రహదారిని నిర్మించామన్నారు. కోడుమూరు పీఆర్‌ డీఈ కర్రెన్న ఎంపీడీవో రఘునాథ్‌, సర్పంచులు ఎం.మాధవస్వామి, ఆకెపోగు జయన్న, ఇన్‌చార్జి ఏఈ నాగరాజు పాల్గొన్నారు.

కోడుమూరు రూరల్‌: మండలంలోని లద్దగిరి పీహెచ్‌సీ పరిధిలో పల్స్‌ పోలియో విజయవంమైనట్లు వైద్యాధికారి డా.భాస్కర్‌ తెలిపారు. 32 పోలింగ్‌ కేంద్రాలతో పాటు 2 ట్రాన్సిట్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5081 మంది చిన్నారులు ఉండగా, 5167 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మహేశ్వర ప్రసాద్‌ గోరంట్ల, అమడగుంట్ల గ్రామాల్లో పల్స్‌ పోలియోను తనిఖీ చేశారు. వైద్యాధికారులు డా.జయంతి, శ్రీమంత్‌ మాదన్న, డీహెచ్‌ఈవో శ్రీనివాసయాద్‌, సీహెచ్‌వో శాంత, సూపర్‌వైజర్‌ శారద పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన్‌: అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌ సూచించారు. ఆదివారం బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాల విద్యార్థినులు కల్లూరు ఇండస్టీరియల్‌ ఎస్టేట్‌, ఓల్డ్‌ శాంతినికేతన్‌ పాఠశాలలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.

గూడూరు:పట్టణ టీడీపీ అద్యక్షుడు కే.రామాంజనేయులు నగర పంచాయతీ పరిధిలోని కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సింగిల్‌ విండో డైరెక్టర్‌ రేమట వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, ఎల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:02 AM