డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:34 AM
డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు.
ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. మీప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ కనిపిస్తే ప్రతి తల్లి దీన్ని గమనించాలని, వెంటనే టోల్ ఫ్రీనెంబర్ 1972కు ఫోన్ చేయాలన్నారు. ఇందుకు ప్రతి తల్లి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇటీవల ఆపరేషన్ సేవ్ క్యాంపస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల సరిహద్దులో ఉన్న పొగాకు ఉత్పత్తుల, షాపులపై నిఘా పెట్టామన్నారు. ఆపరేషన్ సేవ్ పేరుతో25వేల విద్యాసంస్థల్లో పొగాకు, నికెటిన్, ఇతర డ్రగ్స్ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సమష్టి కృషితోనే డ్రగ్స్‌ను పారదోలుతామన్నారు. ఈగల్ టీం గంజాయి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు కృషి చేసినందుకు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ప్రశంసలు అందాయన్నారు.