Share News

వైభవంగా అహోబిలేశుడి పార్వేట

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:28 PM

నంద్యాల పట్టణంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాన్ని శుక్ర వారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా అహోబిలేశుడి పార్వేట
పల్లకిపై విహరిస్తున్న ఉత్సవ మూర్తులు

నంద్యాలలో మొదటిసారి వేడుకలు

అంతర్జాతీయ గుర్తింపునకు కృషి : ఎంపీ బైరెడ్డి శబరి

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాన్ని శుక్ర వారం వైభవంగా నిర్వహించారు. మన ఊరు మనగుడి మన బాధ్యత ఆధ్వర్యంలో నిర్వహించారు. అహోబిలేశుడి పార్వేట ప్రాముఖ్యత తెలి సేలా మొదటిసారి నంద్యాలలో నిర్వహించినట్లు తెలిపారు. సంకీర్తనలు, కోలాటాలు, చెక్కభజనలతో నరసింహస్వామి వేషధారణతో, లక్ష్మీనరి సంహస్వామి ఉత్సవమూర్తులు రాగా వీరివెంట అహోబిలం చెంచులు విల్లంబులు చేతపట్టి పాల్గొన్నారు. మన ఊరు మనగుడి మన బాధ్యులు శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అహోబిలం లక్ష్మీనర సింహాస్వామి పార్వేటకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిస్తూ 20వేల ఉత్తరాలను రాశామని చెప్పారు. మున్సిపల్‌ టౌన్‌ హాలు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని చెంచుల విల్లంబు చేతపట్టుకొని మాటాడారు. అహోబిలేశుడు తన కల్యా ణానికి రావాలని 33 గ్రామాల్లో 45 రోజులు తిరిగి భక్తులను ఆహ్వా నించడం ప్రపంచ చరిత్రలో అరుదైన ఘటనగా అభివర్ణించారు. కాకతీ యుల కాలం నుంచి వెయ్యేళ్లుగా ఈ సంప్రదా యం కొనసాగించడం అభినందనీయమని అన్నారు. అహోబిలేశుడి పార్వేటకు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని ఎంపీ చెప్పా రు. కార్యక్రమంలో అహోబిల దేవస్థానం సిబ్బంది, ఆలయ ముఖ్య సలహాదారులు సేతురామన్‌, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తాతిరెడ్డి తులసిరెడ్డి, ఇస్కాన్‌ టెంపుల్‌, కృష్ణమందిరం ప్రతినిధులు, సత్యసాయి ధ్యాన మండలి, ఆయుష్‌యోగా ధ్యాన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:28 PM