Share News

మహాసభలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:31 AM

భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈనెల 23 నుంచి 25 వరకు జరుగుతున్నాయని, విజయవంతం చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

 మహాసభలను జయప్రదం చేయాలి
జీపుజాతాను ప్రారంభింస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు

నందికొట్కూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈనెల 23 నుంచి 25 వరకు జరుగుతున్నాయని, విజయవంతం చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పగిడ్యాల, మిడ్తూరు, నందికొట్కూరు పట్టణాల్లో గురువారం ప్రచార జీపుజాతాను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రఘురామమూర్తి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విద్యా, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో 26 జిల్లా సమగ్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, రోజువారి కూలీల సమస్యలపై విద్యార్థి, యువజన మహిళా, దళిత, మైనార్టీ సమస్యలపై పోరా టం, సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ఆగస్టు 23న ఒంగోలు నగరంలో నిర్వహించే సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిడ్యాల మండల కార్యదర్శి మజీద్‌, సిపిఐ నాయకులు సుంకన్న, వెంకటేశ్వర్లు, అబ్దుల్‌ రహ్మాస్‌, దివాకర్‌, రఫి పాల్గొన్నారు.

పగిడ్యాల : ఒంగోలులో ఈ నెల 23వ తేదీ నిర్వహించే సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు రఘరామూర్తి, మండల నాయకుడు మజీద్‌ పిలుపునిచ్చారు. మహాసభలను విజయవంతం చేయాలని పగిడ్యాలలో గురువారం జీపుజాతా నిర్వహించారు.

Updated Date - Aug 22 , 2025 | 12:31 AM