Share News

మహాసభలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:11 AM

ఒంగోలులో 20నుంచి 25వరకు జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి హరినాథ్‌ అన్నారు.

మహాసభలను జయప్రదం చేయాలి
గోడపత్రికలు విడుదల చేస్తున్న సీపీఐ నాయకులు

గోస్పాడు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో 20నుంచి 25వరకు జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి హరినాథ్‌ అన్నారు. శనివారం గోస్పాడులో కార్యకర్తలతో కలిసి గోడపత్రికలను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యం పేదలు, బడుగు, బలహీనవర్గాల కోసం పాటుపడే సీపీఐ పార్టీకి ప్రజలు అండదండగా నిలవాలన్నారు. మహాసభలకు విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయులు, స్కీం వర్కర్లు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి జిలానిబాషా, మౌల, నరసింహ, నాగరాజు, వెంకటేశ్వర్లు, గౌతమ్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 01:11 AM