ఆర్డీఎ్‌సకు వరద పోటెత్తింది
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:33 PM
అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలకు మండలంలోని అగసనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది.
కోసిగి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలకు మండలంలోని అగసనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాష్ట్రంతో పాటు ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో ఆర్డీఎస్ ఆనకట్ట మీద నుంచి దిగువకు నీరు పారుతోంది. మరో రెండు రోజులు ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు. నదితీర ప్రాంతంలో చేతికొచ్చిన పైర్లు నీటి మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.