స్వర్ణ రథంపై ఆది దంపతులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:38 PM
మల్లికార్జునస్వామి జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శ్రీశైలంలో మంగళవారం స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది.
నంద్యాల కల్చరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మల్లికార్జునస్వామి జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శ్రీశైలంలో మంగళవారం స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు స్వామి అమ్మవార్లకు నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా స్వర్ణరథోత్సవంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తుల శివసామస్మరణతో వేదమంత్రాల నడుమ గంగాధర మండపం చుట్టూ స్వర్ణరథం కదిలింది. రథం ఎదుట కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం, జానపద కళారూపాలు ఆక ట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.