Share News

పోరాటం ఆగదు

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:48 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌ కోడ్స్‌ రద్దు అయ్యే వరకు కార్మిక వర్గం పోరాడు తూనే ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిం చారు.

పోరాటం ఆగదు
జిల్లా పరిషత్‌ నుంచి ర్యాలీగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులు

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాల్సిందే

కార్మికులను కట్టుబానిసలు కానివ్వం

కార్మిక సంఘాల నాయకుల హెచ్చరిక

ముగిసిన సార్వత్రిక సమ్మె

కర్నూలు న్యూసిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌ కోడ్స్‌ రద్దు అయ్యే వరకు కార్మిక వర్గం పోరాడు తూనే ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిం చారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం ఏఐటీయూసీ, సీఐటీ యూ నగర కార్యదర్శులు జి. చంద్రశేఖర్‌, విజయ్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ నుంచి రాజవిహార్‌, మెడికల్‌ కాలేజీ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజి బాబు మాట్లాడుతూ బీజేపీ తీసుకువచ్చిన చట్టాలతో కార్మికులను కట్టుబానిసలు కానివ్వమన్నారు. ఇప్పటికే దేశ సంపదలో 40 శాతం బడా పెట్టుబడిదారుల స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌. మునెప్ప మాట్లాడుతూ లేబర్‌ కోడ్స్‌ కార్మికులకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ పని గంటల పెంచి, రాత్రి పూట మహిళలతో పని చేయించాలని నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అన్నారు. అనంతరం శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి. నిర్మల మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జే. లలిత, ఏఐబీఈఏ రాష్ట్ర నాయకుడు నాగరాజు, జనరల్‌ ఇన్సూరెన్సు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు రఘుబాబు, ఏపీజీబీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకుడు హనుమంతరెడ్డి, ఎల్‌ఐసీ యూనియన్‌ కార్యదర్శి సునియాకుమార్‌, బీఎ్‌సఎన్‌ఎల్‌ నాయకుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:48 PM