రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:35 PM
ఈ నెల 18, 19 తేదీల్లో ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం పిలుపునిచ్చారు.
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం
కర్నూలు న్యూసిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ నెల 18, 19 తేదీల్లో ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం పిలుపునిచ్చారు. ఆదివారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి క్వింటానికి రూ.12వేలు కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన అతివృష్టి కారణంగా పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వేలాది మంది రైతులు పెట్టుబడి పెట్టిన ఖర్చుల రాక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఆదోనిలో జరిగే ఈసమ్మేళనానికి ఏఐకేఎస్ జాతీ య అధ్యక్షుడు క్షీరసాగర్, జాతీయ కార్యదర్శి రాగుల వెంకయ్య, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జల ఈశ్వరయ్య, రామచంద్రయ్య, కేవీపీ ప్రసాద్ హాజరవుతారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్ల కార్యదర్శి దంభోళం శ్రీనివాసరావు, రాముడు, బాషా పాల్గొన్నారు.