Share News

‘మొంథా’తో రైతన్న కుదేలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:53 PM

మొంథా తుఫాన ప్రభావంతో మండలంలో గత మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు రైతన్న కుదేలయ్యారు

‘మొంథా’తో రైతన్న కుదేలు
చాగలమర్రిలో నీట మునిగిన వరి, జొన్న పంట

జల దిగ్బంధంలో గ్రామాలు

పొంగి ప్రవహిస్తున్న వక్కిలేరు, కుందూ

నీట మునిగిన పంటలు

చాగలమర్రి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన ప్రభావంతో మండలంలో గత మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు రైతన్న కుదేలయ్యారు. గురువారం వరుణుడు వీడిన వరద తగ్గలేదు. కుందూ, వక్కిలేరు పొంగి ప్రవహించడంతో జన జీవనం స్తంభించింది. మండలంలోని బ్రాహ్మ ణపల్లె, కలుగొట్లపల్లె, నేలంపాడు గ్రామాలు జలదిగ్భంధం లో ఉన్నాయి. చాగలమర్రి, కలుగొట్లప ల్లెలో వరి, జొన్న, మినుము పంటలు నీట మునిగాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది.

దొర్నిపాడు: మొంథా తుఫాన ప్రభావంతో దొర్నిపాడు మండ లంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. క్రిష్టిపాడు, దొర్నిపాడు లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోవెలకుంట్ల నుంచి క్రిష్టి పాడు గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నీరు అధికంగా ఉండటంతో ఆయా గ్రామాల రాకపోకలు స్తంభించి పోయాయి. క్రిష్టిపాడు కుందూనది ఉగ్రరూపం దాల్చడంతో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఎంపీడీవో సావిత్రి సిబ్బందితో వెళ్లి పంట పొలా లను గురు వారం పరిశీలించారు. ఎంపీడీవో సావిత్రి, వ్యవసాయాధికారి ప్రమీల, సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించారు.

రుద్రవరం: మండలంలోని చిలకలూరు గ్రామ సమీపంలో వక్కిలేరు వాగు గత నాలుగురోజులుగా పొంగి ప్రవహిస్తుంది. గురు వారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎర్రగుడిదిన్నె వద్ద ఉన్న నేలవంతెనపై కూడా వరదనీరు ప్రవాహం తగ్గలేదు. అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుడిదిన్నె నేల వంతెన దెబ్బ తిందని స్థానికులు తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 11:53 PM