తాగునీటి సమస్య పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:55 PM
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండలంలోని జలదుర్గం గ్రామంలోని సచివాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
ప్యాపిలి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండలంలోని జలదుర్గం గ్రామంలోని సచివాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొత్తకొట్టాలలో దాదాపు మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టిం చుకోవడంలేదని కాలనీ వాసులతోపాటు సీపీఐ మండల కార్యదర్శి అబ్దుల్ చిన్నరహిమాన ఆరోపించారు. కార్యక్రమంలో నక్కి శ్రీకాంత, శ్రీనివా సులు, శ్రీనివాసులు, కృష్ణ, వీరభద్రుడు పాల్గొన్నారు.