కుప్పం వాసుల కల సాకారం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:25 PM
రాయల సీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ వాసుల దశాబ్దాల కల సాకారమైందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు.
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి కృష్ణమ్మ పరుగులు
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాయల సీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ వాసుల దశాబ్దాల కల సాకారమైందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. నందికొట్కూరు మండలం మల్యాల వద్దగల హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు కుప్పంకు చేరిన సందర్భంగా శనివారం ఎమ్మెల్యే జయసూర్య నదీజలాలకు పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలుగురు సీఎంలతో కాని పనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసి చూపించారని కొనియాడారు. జూలై నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు ఇదే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారన్నారు. 40 రోజుల్లోనే కుప్పంకు సాగు నీరందించి ఈ ప్రాజెక్టు కలను సాకారాం చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి, రాష్ట్ర యాదవసంఘం నాయకులు కడియం వేంకటేశ్వర్లు, ఖాతా రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.