Share News

పేదల సొంతింటి కల నెరవేర్చాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:05 AM

పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేర్చాలి
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు

కర్నూలు న్యూసిటీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు. సోమవారం సీపీఎం అధ్వర్యంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. తమకు ఇళ్ల స్థలాలు చూపించండి అంటూ కలెక్టరేట్‌ ఎదుట పేదలు బైఠాయించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసు కుని డీఆర్‌ఓను పిలిపించి వినతి పత్రం అందజేసి సమస్యను సద్దుమ ణిగించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ పాలకులు మారినప్పుడల్లా ఇళ్ల స్థలాల పేరుతో తమ సొంత మార్కును చూపిం చుకోవడం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గసభ్యురాలు పి.నిర్మల, ఎండీ ఆనంద్‌బాబు, పీఎస్‌. రాధాక్రిష్ణ, టి.రాముడు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు: సీపీఐ

జిల్లాను ఎడారిగా మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని సీపీఐ నాయకులు విమర్శించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నగర సహాయ కార్యదర్శి మహేష్‌ అధ్వక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్‌ నాయకుడు కె.జగన్నాథం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న బడ్జెట్‌లో పశ్చిమ ప్రాంత ప్రాజెక్టు లకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మునెప్ప, రామక్రిష్ణారెడ్డి, నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:05 AM