Share News

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:40 AM

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్‌, సేల్‌ ట్యాక్స్‌ తదితర రాయితీల కింద జిల్లాలో ఉత్పాదన, సేవా రంగాల్లోని 24 యూనిట్లకు 1.67కోట్ల విలువైన రాయితీ ప్రయోజనాలు మంజూరు చేశామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి గత త్రైమాసికంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులకోసం పది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సింగల్‌ డెస్క్‌ విధానంలో ఆయా శాఖల ద్వారా 8పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన రెండు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెఇలపారు. వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం జవహర్‌బాబు, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫ్యాక్టరీస్‌ నారాయణరెడ్డి, ఎల్‌డీఎం రవీంద్రకుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:40 AM