పలుమార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత టీడీపీదే
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:11 PM
పలుమార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి) : పలుమార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తొమ్మిదిసార్లు డీఎస్సీ నిర్వహించి విరివిగా ఉద్యోగాలిచ్చారన్నారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఐటీ, ఏఐ, క్వాంటం వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.