రైతు సాధికారతతోనే దేశం సుసంపన్నం
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:47 PM
రైతు సాధికారతతోనే దేశం సుసంపన్నంగా ఉంటుందని జేడీఏ వరలక్ష్మి పేర్కొన్నారు.
కోడుమూరు రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రైతు సాధికారతతోనే దేశం సుసంపన్నంగా ఉంటుందని జేడీఏ వరలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ప్యాలకుర్తి గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై రైతులకు అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గించడంతో వ్యవసాయ, డ్రిప్పు, ఆక్వాకల్చర్, సూక్ష్మపోషకాలు, పాలక్యాన్ల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ విలువపై రైతులకు అవగాహన ఉండాలని, లేకుంటే మోసాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జీఎస్టీ అధికారి రమాదేవి తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాముడు, ఏవో రవిప్రకాష్, హార్టికల్చర్ అధికారి మదన్‌మోహన్ పాల్గొన్నారు.