Share News

కాంట్రాక్టర్‌కు దోచిపెడుతున్నారు

ABN , Publish Date - May 01 , 2025 | 12:30 AM

అభివృద్ధి పనుల పేరిట ప్రజల సొమ్మును కాంట్రాక్టర్‌కు దోచిపెడుతున్నారని నగర పంచాయతీ అధికారుల తీరుపై వైస్‌ చైర్మన పీఎన అస్లాం మండిపడ్డారు.

కాంట్రాక్టర్‌కు దోచిపెడుతున్నారు
కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న వైస్‌ చైర్మన పీఎన అస్లాం

అధికారుల తీరుపై మండిపడ్డ వైస్‌ చైర్మన

గూడూరు ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల పేరిట ప్రజల సొమ్మును కాంట్రాక్టర్‌కు దోచిపెడుతున్నారని నగర పంచాయతీ అధికారుల తీరుపై వైస్‌ చైర్మన పీఎన అస్లాం మండిపడ్డారు. బుధవారం గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన జె వెంకటేశ్వర్లు అధ్యక్షతన నగర పంచాయతీ సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. సమావేశం ప్రారం భం కాగానే ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు కౌన్సిల్‌ అనుమతి అంటూ అజెండాలో ఎందుకు పెట్టారని వైస్‌ చైర్మన పీఎన అస్లాం కమిషనర్‌ రమేష్‌బాబును ప్రశ్నించారు. డ్రైయినలను డిసిల్టింగ్‌ చేసే పనులు ఎప్పుడో పూర్తి చేస్తా రని, మరి ఇప్పుడు కౌన్సిల్‌ అమోదం కోసం ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. జనరల్‌ ఫండ్‌లోని నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లించాలని కౌన్సిల్‌ అమోదానికి అజెం డాలో ఉంచడం సరికాదన్నారు. అలాగే అన్న క్యాంటీన భవనం మరమ్మతు పనులు ఎప్పుడో పూర్తి చేస్తారని ఇప్పుడు అజెండాలో ఎందుకు పెట్టారని కమిషనర్‌ను వైస్‌ చైర్మన ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిన పనులకు జనరల్‌ ఫండ్‌ ద్వారా చెల్లింపులు ఎలా చేస్తార న్నారు. కేవలం అభివృద్ధి పనుల పేరిట దోపిడీ జరుగుతుందని, నగర పంచాయతీ అధికారులు కాంట్రాక్టర్‌కు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ పనులకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉంచాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ గతంలో పనులు జరిగిన సమయంలో తానులేనని అన్న క్యాంటీన మరమ్మ తులకు సంబంధించి నిధులు రాలేదని, అందుకే జనరల్‌ ఫండ్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేసేందుకు అజెండాలో కౌన్సిల్‌ అనుమతి కోసం ఉంచామన్నారు. సభ్యులు తీర్మాణం చేస్తే చెల్లిస్తాం లేదంటే పెండింగ్‌లో ఉంచుతామన్నారు. దీనికి వైస్‌ చైర్మన పీఎన అస్లాం, మరికొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉంచాలని సూచించారు. అలాగే శానిటేష్‌ అధ్వానంగా ఉందని అధికారులు ఏం చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు మండిపడ్డారు. అలాగే ఆయా కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కౌన్సి లర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈసమావేశంలో మేనేజర్‌ విజయ లక్ష్మి, కౌన్సిలర్లు, కోఆప్షన సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:30 AM