పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:19 AM
స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాజకుమారి మంగళవారం తనిఖీ చేశారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాజకుమారి మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి సిలబస్‌ను డిసెంబరుకు పూర్తి చేసి వంద రోజుల యాక్షన ప్లానను ఇచ్చామన్నారు. ఇందులో గ్రేడ్‌లుగా విభజించి వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శోభావివేకవతి, కమిషనర్ కిషోర్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.