Share News

రాష్ర్టాభివృద్ధే సీఎం లక్ష్యం

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:24 PM

: రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని జలవనరుల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

రాష్ర్టాభివృద్ధే సీఎం లక్ష్యం
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ధరలు

ప్రధాని కోసం సీమ ప్రజల ఎదురుచూపులు

జలవనరుల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

టూరిజం కారిడార్‌పై సీఎం ఫోకస్‌

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలును డ్రోన్‌ హబ్‌గా మార్చేందుకు కృషి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని జలవనరుల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ , టీడీపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తిక్కారెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిమ్మల మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గాయని, ఇలా జరగడం దేశంలోనే ఇదే తొలిసారి అని అన్నారు. రాయలసీమలో పరిశ్రమల కారిడార్‌ను అమలుచేసి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోట్ల నిధులను కేటాయించి పెండింగ్‌ పనులను పూర్తి చేసి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించిందన్నారు. మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు టూరిజం కారిడార్‌పై ఫోకస్‌ పెట్టారని, అనంతపురం- కర్నూలు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ది చెందుతుందన్నారు. శ్రీశైలంలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం కానుందని అన్నారు. ప్రధాని మోదీ వస్తున్నందున చాలా అంచనాలు ఉన్నాయని, కర్నూలుకు మోదీ వరాలు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. మోదీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ రాకతో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలును డ్రోన్‌ హబ్‌గా ప్రభుత్వం మార్చునుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యే దామచర్ల, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్లు కొంకతి లక్ష్మినారాయణ, ధరూర్‌ జేమ్స్‌, పోతురాజు రవి, నంద్యాల నాగేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకరవాడ చిన్న వెంకటేశ్వర్లు, హనుమంతరావు చౌదరీ, ముంతాజ్‌ బేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:24 PM