దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:33 PM
రాష్ట్ర ఆబ్కాప్ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్ బీఎస్ నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆబ్కాప్ చైర్మన్‌గా నియమించి మత్స్యకారుల దశాబ్దాల కల నెరవేర్చారని మత్స్యకారుల సహకార సంఘం నాయకులు అన్నారు.
చంద్రబాబుకు మత్స్య సహకార సంఘం నాయకుల కృతజ్ఞతలు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆబ్కాప్ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్ బీఎస్ నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆబ్కాప్ చైర్మన్‌గా నియమించి మత్స్యకారుల దశాబ్దాల కల నెరవేర్చారని మత్స్యకారుల సహకార సంఘం నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆరు దశాబ్దాల ఉమ్మడి జిల్లా మత్స్యకారుల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు నగరంలోని మత్స్యకారుల వ్యాపార సముదాయ ప్రాంగణంలో మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితర సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈ నియామకం జరిగిందన్నారు. బీఎస్ నవీన్ కుమార్ నియామకం ద్వారా ఆబ్కాప్ మరింత బలోపేతం అవుతుందన్నారు. చేపలవేట నిషేధం ఉన్న సమయంలో కోస్తా ప్రాంతంలో మత్స్యకారులకు గౌరవ భృతిని చెల్లిస్తున్నారని, అదేవిధంగా రాయలసీమలో మత్స్యకారులకు కూడా భృతి చెల్లించి 90 శాతం రాయితీతో సహాయ పరికరాలు అందించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కమిటీ సభ్యులు గణేశ్, వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, రమణ, గోపి, మధు, ఈరన్న, శివ, నరసింహులు పాల్గొన్నారు.