మిరప పంట దున్నేశారు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:19 AM
మండలంలోని ఆర్.నాగులవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే రైతు ఆదివారం మూడు ఎకరాల్లో సాగు చేసిన మిరప పంటను దున్నివేశారు.
రుద్రవరం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఆర్.నాగులవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే రైతు ఆదివారం మూడు ఎకరాల్లో సాగు చేసిన మిరప పంటను దున్నివేశారు. మిరప మొక్కలకు ముడ త తెగు లు సోకడంతో ఎదుగు బొదుగు లేకుండా పోయింది. ఎన్ని మందులు పిచికారి చేసినా మొక్కల్లో ఎదుగుదల లేకపోవడంతో పంటను దున్నివేశాడు. ఇప్పటి వరకు మూడుఎకరాలకు రూ.2లక్షలు పెట్టుబడి పెట్టానని అంతా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.