రైతుభరోసా రథాన్ని తిప్పాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:31 AM
పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.
కర్నూలు అగ్రికల్చర్, జూన 3(ఆంధ్రజ్యోతి): పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని మంగళవారం జిల్లా కలెక్టరే ట్‌లో వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మిని కోరారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ ఈ బస్సు(రథం) ఉమ్మడి జిల్లాకు వచ్చి సుమారు ఏడాది కాలం గడిచిపోయిందన్నారు. లక్షలు విలువ చేసే ఈ బస్సును పక్కన పెట్టి వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు.