Share News

కేంద్రం తన విధానాలను మార్చుకోవాలి

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:08 PM

కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వామపక్ష పార్టీ నాయకులు పి.హరినాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

కేంద్రం తన విధానాలను మార్చుకోవాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న వామపక్ష పార్టీల నాయకులు

‘ఉపాధి’ పేరు మార్చడం తగదు

వామపక్ష పార్టీ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వామపక్ష పార్టీ నాయకులు పి.హరినాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట వామపక్ష పార్టీల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం పేరు మార్చడం తగదన్నారు. యూపీఏ ప్రభుత్వంపై ఆనాడు వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న ఉపాధి హమీ చట్టం మౌలిక స్వభావం కేంద్ర ప్రభుత్వం మార్చాలని చూస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన భాధ్యత నుంచి తప్పుకోవడానికి పది నుంచి 40శాతానికి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెంచారన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులు 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేలకోట్ల రూపాయల అదనపు భారం వేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను నోరు మెదపలేకపోవడం దారుణమన్నారు. కలెక్టరేట్‌లో స్పెషల్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే.రామాంజనేయులు, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటస్వామి, రైతుల కూలీ సంఘం జిల్లా నాయకులు సుంకన్న, ఎస్‌యూసీఐ జిల్లా నాయకులు నాగన్న, సీపీఐ జిల్లా సహయ కార్యదర్శులు ఎస్‌.మునెప్ప, లెనిన్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:08 PM