Share News

హామీలను విస్మరించిన కేంద్రం

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:44 PM

ఇచ్చిన హావీలను కేంద్రం విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆరోపించారు.

హామీలను విస్మరించిన కేంద్రం
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

పత్తికొండ టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన హావీలను కేంద్రం విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆరోపించారు. పట్టణంలోని సీఆర్‌ భవన్‌లో పట్టణ, మండల సమితి సమావేశం ఆదివారం ఎంపీటీసీ వీరన్న అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానీకానికి అనేక హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నా హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు అన్నిశాఖల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. జనవరి 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరిగే ముగింపు వేడుకలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాసాహెబ్‌, మండల, పట్టణ కార్యదర్శులు కారుమంచి, రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు గురుదాస్‌, తిమ్మయ్య, కృష్ణ, కారన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:44 PM