Share News

ముందస్తు అడ్మిషన్ల ప్రచారాన్ని నిలిపివేయాలి

ABN , Publish Date - May 06 , 2025 | 12:15 AM

నూతన విద్యాసంవ త్సరం 2025-26 ప్రారంభం కాకముందే జిల్లాలోని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రు లను మోసం చేస్తున్నాయని రిపబ్లికన స్టూడెంట్‌ ఫెడరేషన జిల్లా కార్యదర్శి మహేష్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు వినతిపత్రం అందజేశారు.

ముందస్తు అడ్మిషన్ల ప్రచారాన్ని నిలిపివేయాలి
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న రిపబ్లికన స్టూడెంట్‌ ఫెడరేషన జిల్లా కార్యదర్శి మహేష్‌

కర్నూలు కలెక్టరేట్‌, మే 5(ఆంధ్రజ్యోతి): నూతన విద్యాసంవ త్సరం 2025-26 ప్రారంభం కాకముందే జిల్లాలోని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రు లను మోసం చేస్తున్నాయని రిపబ్లికన స్టూడెంట్‌ ఫెడరేషన జిల్లా కార్యదర్శి మహేష్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులో కూడా నూతన విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు కొనుక్కోవాలని, యూనిఫాం, నూతన విద్యాసంవత్సరం ఫీజు కొంత చెల్లించాలని పాఠ శాల యజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు.

ఫ జిల్లా కేంద్రంలో ప్రెస్‌ క్లబ్‌కు కేటాయించిన క్వార్టర్స్‌ అప్పగిం చాలని కర్నూలు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కొత్తూరు సత్యనారాయణ గుప్తా కలెక్టర్‌ను కోరారు. గత కలెక్టర్‌ వీరపాండియన ప్రభుత్వ క్వార్టర్స్‌ 5, 6 కేటాయించారన్నారు. ఆ క్వార్టర్స్‌ను అప్పగించాలని కోరారు. కార్యక్ర మంలో జర్నలిస్టులు విజయ్‌, బాషా, శివ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఫ నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కూరగాయలను అమ్ముకు నేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. రైతుబజా రులో రైతులకు కాకుండా కొంతమంది దళారులకు అనుమతి ఇవ్వడం తో నిజమైన వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో లక్ష్మన్న, ఆంజనేయులు, కుమారస్వామి పాల్గొన్నారు.

ఫ రేడియో స్టేషన సమీపంలోని శాంతినగర్‌లో మురుగు కాలు వలు సరిగా లేవని, వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్లపైన నిల్వ ఉండి ప్రజలు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. వీటిపై చర్యలు తీసుకోవా లని పట్టణ, పౌర సంక్షేమ సంఘం సభ్యులు పుల్లారెడ్డి, రంగస్వామి, శ్రీరాములు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఫ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ప్రతిపాదనపై పనిచేస్తున్న కార్మి కులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఏఐటీ యూసీ అధ్యక్షుడు ఎ.ఈశ్వర్‌, కార్యదర్శి ఎస్‌.మునెప్ప, సభ్యుడు చంద్ర శేఖర్‌ కోరారు. సోమవారం కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - May 06 , 2025 | 12:15 AM