Share News

ఆధార్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:57 PM

సచివాలయాల పరిధిలో ఆధార్‌ నమోదు, తదితర సేవలు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి తెలిపారు.

ఆధార్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న జడ్పీ సీఈవో నాసరరెడ్డి

జడ్పీ సీఈవో నాసరరెడ్డి

కర్నూలు, న్యూసిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సచివాలయాల పరిధిలో ఆధార్‌ నమోదు, తదితర సేవలు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి తెలిపారు. మంగళ వారం జిల్లా పరిషత్తు సమావేశ భవనంలో యూనివర్సిల్‌ ఆధార్‌ క్లయింట్‌పై సచి వాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. యూఐడీఏఐకు చెందిన మాస్టర్‌ ట్రైనర్‌ వెంకరమణ ఆధార్‌ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లా డుతూ యూనివర్సల్‌ అనేది ఆన్‌లైన్‌ ఆధునిక సాఫ్ట్‌వేర్‌ అన్నారు. ఇది వివిధ ఆధార్‌ సంబం ధిత సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందు బాటులోకి తీసుకు వస్తుం దన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆధార్‌ నమోదు, నవీకరణ ప్రక్రియ వేగంగా, కచ్చితంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:57 PM