మేమింతే..!
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:20 AM
ఎంపీడీవో, తహసీల్దార్‌లతో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని టీడీపీ నాయకులు ఎర్రిస్వామి బిజేపొంపాపతి, దిడ్డి వెంకటేష్, సిద్ధిక్ సాబ్ అన్నారు.

హొళగుంద, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : ఎంపీడీవో, తహసీల్దార్‌లతో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని టీడీపీ నాయకులు ఎర్రిస్వామి బిజేపొంపాపతి, దిడ్డి వెంకటేష్, సిద్ధిక్ సాబ్ అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఉదయం 11 గంటల తరువాత కూడా రాలేదన్నారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గోవింద్ రావ్ మినహా ఏ అధికారి హాజరుకాకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ నిజాముద్దీన్‌ను వివరణ కోరగా కలెక్టర్ మీటింగ్‌లో ఉన్నానని, మిగతా అధికారులు ఎవరు రాకపోవడంపై విచారణ చేస్తామని తెలిపారు.