Share News

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌

ABN , Publish Date - May 15 , 2025 | 12:07 AM

విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌
స్టాక్‌పాయింట్‌లో ఉన్న పుస్తకాలు

మండల స్టాక్‌ పాయింట్‌కు చేరిన పుస్తకాలు

బడి తెరిచిన రోజే విద్యార్ధులకు పంపిణీ

ఆదోని అగ్రికల్చర్‌, మే14 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గంలోని మండల స్టాక్‌ పాయింట్‌కు పాఠ్య పుస్తకాలలు వచ్చే శాయి. విద్యాశాఖ సిబ్బంది వీటిని ఔపంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 130 ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి మిత్ర కిట్లు అందజేయనున్నారు. ఇందులో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు బెల్ట్‌, బూట్లు ఉంటాయి.

మండల స్థాయి కమిటీ..

మండల స్థాయి కమిటీలో ఎంఈవో-2 అధ్యక్షుడిగా ఉంటారు. ఎంఈవో-1 మండల ఇంజినీరు, ఎంఐఎస్‌ సమన్వయకర్త లేదా డేటాఎంట్రీ ఆపరేటర్‌, సీఎంఆర్డీతో సహా మరో ముగ్గురు సభ్యులుం టారు. కిట్లను స్టాక్‌ పాయింట్‌ను చేర్చి సరి చూసుకొని రసీదులు ఇవ్వడం, యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం తదితరాలను చేస్తారు

బడి తెరిచేనాటికి పంపిణీ

నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు 75ు వచ్చాయి. వీటిని సంబంధిత పాఠశాలలకు చేరుస్తున్నాం, బడి తెరిచిన రోజే పంపిణీ చేస్తాము. ప్రతి విద్యార్థికి వీటిని అందజేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. - శ్రీనివాసులు, ఎంఈవో, ఆదోని

Updated Date - May 15 , 2025 | 12:07 AM