Share News

టెట్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:39 PM

నంద్యాల జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి

టెట్‌ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు

జిల్లాలో 35 మంది గైర్హాజరు

నంద్యాల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈపరీక్షకు బుధవారం 35 మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు ఉదయం సెషన్‌లో మాత్రమే తెలుగు పరీక్షను నిర్వహించారు. 410మంది అభ్యర్థులు హాజరుకావాల్సి వుండగా 375 మంది హాజర య్యారు. నాలుగు సెంటర్‌ల వద్ద గట్టి బందోబస్తు మధ్య మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పరీక్షలను నిర్వహించారు. డీఈవో జనార్దన్‌రెడ్డి, ఫ్లయిండ్‌ స్వ్కాడ్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, డిపార్ట్‌మెంటల్‌ అధికారి రామసుబ్బయ్య పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - Dec 10 , 2025 | 11:39 PM