అవినీతి అధికారుల్లో దడ
ABN , Publish Date - May 22 , 2025 | 12:32 AM
అవినీతి అధికారుల్లో దడ మొదలైంది. మరిన్ని శాఖలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవలే పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరి ఏసీబీ అధికారులకు చిక్కారు.
మరిన్ని శాఖలపై ఏసీబీ నిఘా
రెవెన్యూ’లో పైసలిస్తే పనులు అనే ఆరోపణ
పోలీసు శాఖలోనూ ఇదే తంతు..
ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న చైతన్యం
లంచం అడిగితే ఫిర్యాదు
మార్పుతోనే అవినీతి అంతం: సోమన్న,
డీఎస్పీ, ఏసీబీ
ఆళ్ళగడ్డ, మే 21 (ఆంధ్రజ్యోతి): అవినీతి అధికారుల్లో దడ మొదలైంది. మరిన్ని శాఖలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవలే పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరి ఏసీబీ అధికారులకు చిక్కారు. అతడి వద్ద ఉన్న కేజీల కొద్ది బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్థులపై దాడులు కొనసాగి స్తున్నారు. కింది స్ధాయి అధి కారుల వద్ద పనులు కాకపోతే ప్రజలు ఉన్నత స్థాయి అధికారుల వద్దకు తమ సమస్యలు విన్నవించేందుకు వస్తున్నా రు. వారు కూడా లంచాలు అడుగు తుండటంతో చేసేదీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎవరు లంచం అడిగినా వెంటనే ఏసీబీకి సమాచారం ఇస్తున్నారు.
విద్యుత్ శాఖలోనే
ఆళ్లగడ్డ మండలం చిన్న కంబలూరులో విద్యుత్ ఏడీఈ రవికాంత్‌చౌదరి, సిబ్బంది ప్రతాప్ రూ.40 వేలు లంచం తీసు కుంటూ ఇటీవలే పట్టుబడ్డారు. విద్యుత్ శాఖలోనే మరికొం తమంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరు సంపాదిం చుకుంది చాలని అతిగా వ్యవహ రిస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని మెల్లగా ఆయా కార్యాలయాల నుంచి ఇతర ప్రాంతాలకు జారుకొన్నట్లు సమాచారం.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని..
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పంచాయతీ రాజ్ శాఖలపై కూడా ఏసీబీ అధికారులు నిఘా వేసినట్లు ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పైసలిస్తే తప్ప పనులు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలో కూడా అక్కడ క్కడ కొంతమంది లంచావతారులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆళ్లగడ్డ ఎస్‌ఐ హరిప్రసాద్ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ వద్ద రూ 20 వేలు లంచం డిమాండ్ చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ రూ.10 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఇంకా పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేయ గా ట్రాక్టర్ డ్రైవర్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి అధికా రులు ఇటీవల కాలంలో దాడులు ముమ్మ రం చేయడంతో పాటు ఉన్నతాధికా రులను సైతం కటకటాలపాలు చేస్తుండ డంతో ప్రజలకు కొండంత ధైర్యం వస్తుంది.
ఎక్కడ అవినీతి జరిగినా ఫిర్యాదు చేయండి
అవినీతి ఎక్కడ జరిగినా ఫిర్యాదు చేయండి. పిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. ప్రజల్లో మార్పు వస్తే అవినీతి కూడా అంతరించిపోతుంది. - సోమన్న, డీఎస్పీ, ఏసీబీ