Share News

ప్రధాని సభ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:18 AM

నన్నూరు టోల్‌గేటు సమీపంలో గురువారం నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ మహాసభ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు.

ప్రధాని సభ వద్ద ఉద్రిక్తత
నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు... పోటీగా బీజేపీ నాయకుల నినాదాలు

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల నినాదాలు.. కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు..

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నన్నూరు టోల్‌గేటు సమీపంలో గురువారం నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ మహాసభ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. మొదట యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రధాన ద్వారం వద్ద విభజన చట్టం అమలు చేయాలని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. దీనికి పోటీగా బీజేపీ నాయకులు కూడా నినాదాలు చేశారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్‌ అని దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని బీజేపీ నాయకులు తెలిపారు. పోలీసులు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - Oct 17 , 2025 | 12:18 AM