పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:41 PM
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసేందుకు సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో వచ్చి వచ్చారు.
నీటిని విడుదల చేయడానికి వచ్చిన సీపీఎం నాయకులు
అడ్డుకున్న పోలీసులు
జూపాడుబంగ్లా, జూలై4 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసేందుకు సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో వచ్చి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడే కూర్చుని ఆందోళన చేపట్టారు. పోలీసులు సీపీఎం, రైతుసంఘాల నాయకులను బలవంతంగా అరెస్టు చేసి జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీశైలం జలాయానికి 854 అడుగులు చేరి 15రోజులైన ప్రభుత్వం దిగువకు నీటిని వదలకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసేవరకు ఇక్కడినుంచి పోయేదీలేదని భీస్మించి కూర్చున్నారు. పోలీసులు నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడటంతో కృష్ణాబోర్డు యాజమాన్య బోర్డు నుంచి అనుమతికోరామని, అనుమతి రాగానే మూడు రోజుల్లోపు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దిగువ తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీకి నీరు విడుదల చేసి రాయలసీమను ఆదుకోవాలని డిమాండు చేశారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం, సీపీఎం నాయకులు రామచంద్రుడు, వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, వీరన్న, నాగేశ్వరరావు, కర్ణ, పక్కీర్ సాహెబ్, రంగమ్మ రైతులు పాల్గొన్నారు.