పోటాపోటీగా..
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:12 AM
పట్టణంలోని సంజీవనగర్ గేటునుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు వేయనున్న సీసీరోడ్డు నిర్మాణానికి గురువారం టెండర్ల ప్రక్రియ పోటాపోటీగా సాగింది.
రూ.4కోట్ల సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు
పాల్గొన్న నలుగురు కాంట్రాక్టర్లు
నంద్యాల హాస్పిటల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సంజీవనగర్ గేటునుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు వేయనున్న సీసీరోడ్డు నిర్మాణానికి గురువారం టెండర్ల ప్రక్రియ పోటాపోటీగా సాగింది. రూ.4కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి పనులను చేజిక్కించుకునేందుకు నలుగురు కాంట్రాక్టర్లు పోటీపడినట్లు తెలుస్తోంది. నెల్లూరుకు చెందిన పీటీఆర్ బ్రదర్స్ ప్రాజెక్ట్స్ కంపెనీ, కర్నూలుకు చెందిన డీఏఎంఎస్‌ఎన్ కన్‌స్ట్రక్షన్స్, పి.వెంకటకృష్ణారెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన పీవీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు పోటీపడినట్లు సమాచారం. ఈ టెండర్లు ప్రస్తుతం టెక్నికల్ టీమ్ బ్రిడ్లను పరిశీలించిన అనంతరం సీఈకి రెఫర్ చేయనున్నట్లు తెలిసింది. మంత్రి బంధువు టెండర్ దక్కించునేందుకు పావులు కదుపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్నేళ్లుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాకాలంలో మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉంటూ ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగానే రూ.4కోట్లు సీసీరోడ్డు నిర్మానికి మంజూరు చేశారు.
నాలుగు రోజుల్లో టెండర్లు ఓపెన్
నంద్యాల పట్టణంలో రూ.4కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారికి సంబంధించిన టెండర్లను సీఈ ఆధ్వర్యంలో మరో నాలుగు రోజుల్లో ఓపెన్ చేయ నున్నాం. సీక్రెట్ పద్దతి ద్వారా టెండర్లు స్వీకరిం చాం. టెక్నికల్ కమిటీ బ్రిడ్లను ఎవాల్యుయేషన్ చేసిన అనంతరం సీఈకి ప్రతిపాదిస్తాం. సీఈ ఆధ్వర్యంలో బహిరంగంగా టెండర్లు ఓపెన్ చేస్తాం. - శ్రీధర్‌రెడ్డి, ఈఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, నంద్యాల