Share News

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:10 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వారం రోజుల నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వారం రోజుల నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. కానీ సోమవారం ఒక్కసారిగా కర్నూలు, నంద్యాల జిల్లాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలంలో 40.70 డిగ్రీలు, కోడుమూరు మండలంలో 40.70డిగ్రీలు, హోళగుందలో 40.61, ఆదోనిలో 40.40, కర్నూలు నగరంలో 40.28 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో 40.59 డిగ్రీలు, రుద్రవరంలో 40.55, డోన్‌లో 40.47, ఆళ్లగడ్డలో 40.31, జూపాడుబంగ్లాలో 40.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ మండలాల్లో గాలిలో తేమశాతం తగ్గడంతో వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడురోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

Updated Date - Apr 08 , 2025 | 12:10 AM