ఆలమూరులో 40.35 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:59 PM
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 40.35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రుద్రవరం మండలంలో అత్యధికం
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 40.35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో 40.2, నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం ఈర్నపాడులో 39.98 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలో దొర్నిపాడు గ్రామంలో 39.77, పాణ్యం మండలం గోనవరంలో 39.7, చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 39.49, శిరివెళ్లలో 39.44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మహానంది మండలం గాజులపల్లె, బుక్కాపురం గ్రామాల్లో 39.37, వెల్దుర్తి మండలం కలుగొట్లలో 39.37, సంజామల మండలం లింగందిన్నె గ్రామంలో 39.29, బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామంలో 39.11, బనగానపల్లె పాతపాడు గ్రామంలో 39.03, గోస్పాడు గ్రామంలో 39.02 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో 39.59, కౌతాళం మండలం తోవి గ్రామంలో 39.04, కోసిగి మండలం సత్తనూరులో 39.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాబోయే ఐదు రోజుల్లో..
కర్నూలు జిల్లాలో రాబోవు ఐదురోజుల్లో పలు చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.7 డిగ్రీల సెల్సియస్ నుంచి 40.5 డిగ్రీల వరకు నమోదు కావచ్చని భారత వాతావరణ సంస్థ నిపుణులు వెల్లడించారు. అలాగే ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, గాలిలో తేమశాతం ఉదయం 54 నుంచి 66 శాతం, మధ్నాహ్నం పూట 16 నుంచి 20 శాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
నంద్యాల జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.7 నుంచి 42.2 డిగ్రీలు నమోదు కావొచ్చని భారత వాతావరణ సంస్థ నిపుణులు తెలిపారు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 9 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని, గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 74శాతం, మధ్యాహ్నం 17 నుంచి 20 శాతం నమోదు అయ్యే అవకాశముందని వెల్లడించారు.