Share News

సమష్టి కృషితోనే సహకార బ్యాంకు ముందంజ : జేసీ

ABN , Publish Date - May 30 , 2025 | 12:09 AM

:రైతులకు అవసరమైన అన్ని ప్రయోజనాలు అందించడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముందంజలో ఉందని, దీని కోసం బ్యాంకు అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పరస్పర సహకారంతో కృషి చేశారని జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య తెలిపారు.

 సమష్టి  కృషితోనే  సహకార బ్యాంకు ముందంజ : జేసీ
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య

కర్నూలు అగ్రికల్చర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి):రైతులకు అవసరమైన అన్ని ప్రయోజనాలు అందించడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముందంజలో ఉందని, దీని కోసం బ్యాంకు అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పరస్పర సహకారంతో కృషి చేశారని జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య తెలిపారు. గురువారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవోగా జనరల్‌ మేనేజర్‌గా కొనసాగుతున్న రామాంజనేయులు బాధ్యతలు తీసుకున్నారు. అదే విధంగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించిన విజయకుమార్‌ తన మాతృ సంస్థ ఆప్కాబ్‌ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా విజయకుమార్‌కు సన్మాన కార్యక్రమం బ్యాంకు కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీ నవ్య మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధి పథంలో కొనసాగేలా పని చేసేందుకు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలను వేగవంతంగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీఎం శివలీల, నాగిరెడ్డి, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

డీసీసీబీ చైర్మన్‌గా విష్ణువర్థన్‌రెడ్డి

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా టీడీపీ నాయకులు ఎదురూరు విష్ణువర్థన్‌ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ జీవో.నెం. 350ని గురువారం విడుదల చేశారు. ఈఉత్తర్వులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అందాయి.

Updated Date - May 30 , 2025 | 12:09 AM