సమస్యలుంటే చెప్పండి
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:48 PM
జైలులో ఖైదీలకు ఏమైనా సమస్య లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ్జకార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు.
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి
పత్తికొండ టౌన్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జైలులో ఖైదీలకు ఏమైనా సమస్య లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ్జకార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం పత్తికొండలోని సబ్‌జైలును ఆయన తనిఖీచేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ఖైదీలతో ఆయన మాట్లాడుతూ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. న్యాయవాదులు దామోదర్ ఆచారి, వెంకటయ్య, రాజశేఖర్, దస్తగిరి పాల్గొన్నారు.