Share News

కిషోర బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:30 AM

కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.నిర్మల అన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కిషోర బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి
మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీడీ పి.నిర్మల

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.నిర్మల అన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కిషోర బాలికలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారద మాట్లాడుతూ కిషోర బాలికల వికాసానికి పోషకాహారం ఎంతో ఉపయోగపడు తుందన్నారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు నిండేవరకు వివాహం చేయమని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అబ్బాయిలకు, అమ్మాయిలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ అనురాధ, సూపర్‌వైజర్‌ జమీల, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ బి.పద్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:30 AM