విధుల్లో చేరిన ఉపాధ్యాయులు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:16 PM
మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు సోమవారం పాఠశాలల్లో విధుల్లో చేరడంతో కళకళలాడుతున్నాయి.
నంద్యాల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు సోమవారం పాఠశాలల్లో విధుల్లో చేరడంతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఉపాధ్యాయ నియామకాలు జరగడంతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ముఖ్యంగా ఆదోని డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లోని పాఠశాలల్లో అత్యధికంగా పాఠశాలలో ఏకోపాధ్యాయులతో బోధన కొనసాగుతూ వచ్చేది. ఇక ఈ పాఠశాలలకు ఇద్దరి కంటే ఎక్కువగా ఉపాధ్యాయులు విధుల్లో చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం నియమించడంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో కర్నూలు జిల్లాకు 2,590 మంది కొత్త ఉపాధ్యాయలు వచ్చారు. ఈ ఉపాధ్యాయులందరూ సోమవారం ఉత్సాహంగా పాఠశాల విధులకు హాజరయ్యారు. దీంతో పాఠశాలలు కొత్త ఉపాధ్యాయులతో కళకళలాడాయి.