ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:44 AM
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కర్నూలు ఎడ్యుకేషన, జూలై 8(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాఠశాల ఎదుట ఉన్న రోడ్డుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 13 మంది ఉపాధ్యాయు లు పనిచేసే వారని, దీన్ని వలన మంచి బోధన అంది పబ్లిక్ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చాయన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో గతంలో పని చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీ అయి, కొత్త వారు రావడంతో బోధన అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. సాయంత్రం బడి వేళలు అనంతరం జరిగే స్పెషల్ క్లాసులు జరగడంలేదని వివరించారు. కార్యక్రమములో విద్యార్థుల తల్లిదండ్రు లు ప్రసాద్, నర సింహులు, లక్ష్మీనారాయణ, మధుసూదన, నరేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈవిషయంపై పాఠశాల హెచఎం మాబువుసేని మాట్లాడుతూ పాఠశాలలో 9 ఉపాఽధ్యాయ పోస్టులకుగాను 8మంది పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న గణితశాస్త్ర పోస్టు స్థానంలో సొంత నిధులతో ప్రైవేటు టీచర్‌ను నియమించామన్నారు. గతంలో పని చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి తమపై రెచ్చ కొట్టిస్తున్నట్లు వివరించారు. ఈ ఒత్తిళ్లను భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.