Share News

మహిళలకు అండగా టీడీపీ

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:53 AM

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారుని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బొజ్జమ్మ అన్నారు.

మహిళలకు అండగా టీడీపీ
మహిళలు ఖుషీ.. దేవనకొండ-బంటుపల్లి మార్గం ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల ఆనందం

స్త్రీ శక్తి అమలు.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం

బస్సులో ప్రయాణించిన ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే శ్యాంబాబు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు

ఆలూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారుని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బొజ్జమ్మ అన్నారు. శుక్రవారం ఆలూరు ఆర్టీసీ బస్టాండులో స్త్రీ శక్తి పథకాన్ని హౌసింగ్‌ పీడీ చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో వారు ప్రారంభించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన సీఎంకు మహిళలు కృతజ్ఞతలు తెలెపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మద్దిలేటిస్వామి, టీడీపీ నాయకులు కామినహాల్‌ రమేష్‌, మీనాక్షినాయుడు, రామచంద్రనాయుడు, రఘుప్రసాద్‌ రెడ్డి, అట్టేకల్‌ బాబు, సర్పంచ్‌ నాగరాజు పాల్గొన్నారు.

పత్తికొండ: మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్‌ హామీలు విజయవంతమైనట్లు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో ఎమ్మెల్యే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. మహిళలకు జీరో టికెట్‌ అందచేసి వారిని బస్సులోకి ఆహ్వానించారు. మహిళల ఆర్థిక సాధికారిత సాధించేందుకు చంద్రబాబు పొదుపుసంఘాలను ప్రవేశపెట్టి ప్రోత్సహించారని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.60 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుననేఉఉ అవకాశం ఉందన్నారు. ఆర్డీవో భరత్‌నాయక్‌, ఆర్టీసీ డిప్యూటి సిఎంఈ హరినాథ్‌, నాయకులు ఉన్నారు.

ఆదోని: ఉచిత బస్సు ప్రాయణాన్ని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, గుడిసె కృష్ణమ్మ, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, బీజేపీ నాయకుడు విట్టా రమేష్‌ ఆదోని బస్టాండులో ప్రారంభించారు. మీనాక్షినాయుడు మాట్లాడుతూ స్త్రీ శక్తి కింద ఐదు రకాల బస్సుల్లో మహిళలకు జీరో టికెట్‌తో ప్రయాణం కల్పిస్తారన్నారు. ఇప్పటికే పాసులు ఉన్నవారికి గడువు పూర్తయ్యాక మాత్రమే జీరో ఫేర్‌ టిక్కెట్లు జారీ చేస్తారన్నారు. పల్లెవెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వైసీపీకి చెందిన యూ ట్యూబర్లు, ప్రభుత్వంపై బురదజల్లేందుకు పనిగట్టుకుని ఫేక్‌ వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆరోపించారు. రంగస్వామినాయుడు, మదిరె వీరేష్‌, షాదికాబేగం, నాగరాజుగౌడ్‌, జనసేన నాయకులు రేణువర్మ పాల్గొన్నారు.

దేవనకొండ: మండల కేంద్రం నుంచి మహిళలు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:53 AM