Share News

పీఎం, సీఎం పర్యటనపై నేడు టీడీపీ సమావేశం

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:36 PM

కర్నూలులో ఈనెల 16న దేశప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో సోమ వారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.

పీఎం, సీఎం పర్యటనపై నేడు టీడీపీ సమావేశం
మాట్లాడుతున్న పాలకుర్తి తిక్కారెడ్డి

హాజరు కానున్న మంత్రులు

ఎమ్మిగనూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఈనెల 16న దేశప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో సోమ వారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటనపై కర్నూలు కలెక్టర్‌ కార్యాల యంలో ఉదయం 10:30 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహి స్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనా ర్ధనరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, టీజీ భరత్‌, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మె ల్యేలు, బీజేపీ, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు, ముఖ్యనా యకులు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనను జయప్రదం చేసే విషయంపై చర్చించి ప్రణాళికసిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 05 , 2025 | 11:36 PM