Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:02 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మండలంలోని జూటూరులో మంగళవారం ఏరువాక పౌ ర్ణమి సందర్భంగా నాగలి పట్టి దుక్కిదున్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం
జూటూరులో నాగలిపట్టి దుక్కిదుతున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు

పత్తికొండ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మండలంలోని జూటూరులో మంగళవారం ఏరువాక పౌ ర్ణమి సందర్భంగా నాగలి పట్టి దుక్కిదున్నారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిచారని, వారికి అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ముందుగానే సరఫరా చేసిం దన్నారు. ఈ ఏడాది రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతు లకు ఆధునిక వ్యవసాయ పద్ధతు లను అందుబాటులోకి తెచ్చింద న్నారు. రైతును రాజుగా మార్చేం దుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చా రన్నారు. నాటి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి హంద్రీనీవా నీటిని చెరు వులకు మల్లించే కార్యక్రమాన్ని ప్రాంభించార న్నారు. అదే స్పూర్తితో 70 కి.మీ.ల మేర తూములు ఏర్పాటుచేసి సాగునీరు అందించ నున్నామని అన్నారు. సాంబశివారెడ్డి, రామానాయుడు, జూటూరు ఈశ్వరప్ప, విజయ మోహన్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, సుదర్శన్‌ రెడి,్డ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన వైస్‌ ఎంపీపీ భర్త సంజప్ప

ఎమ్మెల్యే శ్యాంబాబు సమక్షంలో జూటురుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ(వైస్‌ ఎంపీపీ) వడ్డేరంగమ్మ భర్త వడ్దే సంజప్ప టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానిం చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ నాయకుడు బాస్కర్‌రెడ్డిని పరామర్శించారు.

Updated Date - Jun 11 , 2025 | 12:02 AM