Share News

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - May 22 , 2025 | 12:41 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలు, నాయకులకు సూచించారు.

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గజమాల వేస్తున్న కార్యకర్తలు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

మహానాడును జయప్రదం చేయండి

వెల్దుర్తిలో నియోజకవర్గ మహానాడు

వెల్దుర్తి, మే21 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలు, నాయకులకు సూచించారు. బుధవారం వెల్దుర్తిలోని పార్టీ కార్యాలయంలో నాయకుడు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ మహానాడు ర్వహించారు. ముందుగా ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, ఎమ్మెల్యే శ్యాంబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమ రణం పొందిన జవాన్‌ మురళీనాయక్‌కు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కేఈ కుటుంబానికి ఓ బ్రాండ్‌ ఉందన్నారు. చెరువులకు నీళ్లించిన ఘనత మాజీ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తికే దక్కుతుందన్నారు. తండ్రి ఆశయాలను ఎమ్మెల్యే శ్యాంబాబు నెరవేర్చి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. రాజకీయాల్లో ఓపిక చాలా అవసరమని, కడపలో నిర్వహించనున్న మహానా డుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని 400 మెగావాట్ల సోలార్‌ పార్కు, గ్రీన్‌కో, హంద్రీనీవాకు 18 స్లూయిజ్‌ల ఏర్పాటుతో ఆయకట్టు పెరిగి ప్రతి రైతుకి సాగునీరు అందిస్తామన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సాధారణ ఎంపీటీసీగా ఉన్న తాను పార్టీ పుణ్యమా అని ఎంపీగా గెలిచానన్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ మాటాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు తిర్మానాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెర్లకొత్తురు పుల్లయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడ్‌, సుబ్బరాయుడు సాంబశివారెడ్డి, కన్వీనరు బలరాంగౌడ్‌, క్రిష్ణగిరి కన్వీనర్‌ మర్రి శ్రీరాములు, మార్కుట్‌యార్డు చైర్మన్‌ నబిసాహెబ్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:41 AM